
నవతెలంగాణ – మల్హర్ రావు
కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే పేద ప్రజల మలుపు తిరుగుతోందని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు.జాతీయ కాంగ్రెస్ కార్యదర్శి,మాజీ మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గురువారం మండలంలోని మల్లారం, నాచారం, రుద్రారం, తాడిచె ర్ల, ఎడ్లపల్లి గ్రామాల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య ఆధ్వర్యంలో ఇంటింటా ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు.పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి మలహల్ రావు,మాజీ ఎంపిపి ఇస్నపు రవి,సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొoడయ్య, వొన్న తిరుపతి రావు, సంగ్గెం రమేష్, సర్పంచ్ జనగామ స్వరూప బాపు, ఉప సర్పంచ్ దరావత్ శారదా రవి, నాయకులు జంగిడి శ్రీనివాస్, బొబ్బిలి రాజు, జంగిడి సమ్మయ్య, బండి స్వామి, బండి సుధాకర్, భోగే మల్లయ్య, కేశారపు చెంద్రయ్య, ఇందారపు ప్రభాకర్, చిగురు సదయ్య, కన్నూరి రవి, ఓర్రె రాజైలు, గాజు రమా శ్రీనివాస్, రాజునాయక్, రూపేస్ రావు, లింగన్నపేట శ్రీదర్, రమేష్, లింగయ్య పాల్గొన్నారు.