
చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం నుండి మునుగోడు బిఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి గురువారం200 బైక్లతో ర్యాలీ నిర్వహించారు.అంతకుముందు బైక్ ర్యాలీని బీఎస్పీ సీనియర్ నాయకులు మస్కు నరసింహ జండా ఊపి ప్రారంభించారు.బీఎస్పి మునుగోడు అభ్యర్థిగా ఆందోజు శంకరాచారికి రెండోసారి టిక్కెట్ కేటాయించడంతో తొలిసారిగా నియోజకవర్గానికి చౌటుప్పల్ నుండి నారాయణపురం మునుగోడు మీదుగా చండూరు వరకు బైక్ ర్యాలీ కొనసాగనుంది.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి హేమ హేమిలతో తలపడినారు.తొలిసారిగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి దేశ చరిత్రలో నిలిచారు.ఉప ఎన్నికల్లో ఆందోజు శంకరాచారి 4,146 ఓట్లు తెచ్చుకున్నారు.ఈ సార్వత్రిక ఎన్నికల్లో బహుజన వాదమే ఎజెండగా ప్రజల్లోకి వెళ్తామని ఆందోజు శంకరాచారి తెలిపారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ బీఎస్పీ మండల అధ్యక్షులు తగరం సుభాష్ చంద్రబోస్,మునుగోడు నియోజకవర్గ నాయకులు మస్కు నరసింహ,పల్లె లింగస్వామి తదితరులు పాల్గొన్నారు