
నవతెలంగాణ- మల్హర్ రావు
ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి నొట్లొకొచ్చిన సమయంలో పొద్దంతా కోతులు,రాత్రివేళల్లో అడవిపందులు వరి, పత్తి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా రుద్రారం, తాడిచెర్ల,పెద్దతూoడ్ల,నాచారం, ఆన్ సాన్ పల్లి, మల్లంపల్లి, ఎఫ్లపల్లి గ్రామాల్లో అటవీ జంతువుల తాకిడి ఎక్కువగా ఉండటంతో పంటల రక్షణ కోసం రైతులు పాత చీరలు, వైర్లు, రాత్రివేళల్లో మైక్ లు తదితర రక్షణ చర్యలు చేపట్టిన లాభం లేదని వాపోతున్నారు. పొద్దంతా కోతులు పత్తి కాయలు,వరి కొలుసులు ధ్వంసం చేస్తుంటే, రాత్రివేళల్లో అడవిపందులు పంటలను పనికిరాకుండా ధ్వంసం చెస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఒక ఎకరానికి వరి పంట మొదటి నుంచి కోతకు వచ్చే వరకు రూ.20 వెలు, పత్తి రూ.25 వెలు పెట్టుబడులు పెడితే అడబి జంతువుల తాకిడితో పెట్టిన పెట్టుబడులు వచ్చేలా లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా అడవి జంతువుల తాకిడి నుంచి పంటలను కాపాడేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.