- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో మంగళవారం పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో గొర్రె, మేకలకు నట్టల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి దేవేందర్ సర్పంచ్ సాయ గౌడ్ తో కలిసి మందులు వేశారు. 3500 గొర్రె మేకలకు నట్టల నివారణ మందులు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గోపాలమిత్ర, పాడి రైతులు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



