- Advertisement -
- – కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్ - కోదాడలో దళితుడు మాదిగ కులానికి చెందిన కర్ల రాజేష్ మృతి పై హైకోర్టు సిట్టింగ్గ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్ధాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కర్ల రాజేష్ మృతి కి కారణమయిన చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ ను కలెక్టరేట్ కార్యాలయం నందు కలిసి కర్ల రాజేష్ మృతికి కారణమయిన చిలుకూరు ఎస్సై పై చర్యలు చేపట్టాలని, రాజేష్ మృత దేహానికి రిపోస్ట్ మార్టం చేయాలని చేయాలని కోరుతూ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు మృతుడి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ చిలుకూరు ఎస్సై ని కోదాడ శాసనసభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు. మృతికి కారకుడైన చిలుకూరు ఎస్సై గా పనిచేసిన సురేష్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని, కారకులైన సిఐ,డిఎస్పీ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
- పోస్టుమార్టం చేసిన వారు వీడియో తీసిన వారు అగ్రకులానికి చెందిన వారేనని మండిపడ్డారు. జనవరి నెల 10 వ తేదిన కోదాడ లో కర్ల రాజేష్ సంతాపసభ నిర్వహించి, రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలు, సామాజిక న్యాయం కోరే ప్రజాసంఘాలతో తమ పోరాటం ఉదృతం చేస్తామని తెలిపారు. కర్ల రాజేష్ నవంబర్ 16న మృతి చెందాడని డిసెంబర్ 31 వరకు కూడా కుట్రలు చేసి కేసును కనుమరుగు చేసేలా జై భీమ్ సినిమా కధ మాదిరిగా కర్ల రాజేష్ లాకప్ డెత్ అనంతరం పోలీసుల వ్యవహార శైలి వుందని అన్నారు. నిపుణులైన ఫోరెన్సిక్ వైద్యులచే రీ పోస్టుమార్టం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
- ఆయన వెంట ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీ బచ్చలకూర వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ, ఎమ్మార్పీఎస్ సూర్యపేట జిల్లా అధ్యక్షుడు చింత వినయ్ బాబు మాదిగ, సమన్వయకర్త చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి ఏపూరి రాజు మాదిగ ఎమ్మెస్ పి రాష్ట్ర నాయకులు ఎర్ర వీరస్వామి మాదిగ, బొజ్జ సైదులు మాదిగ, బోడ సునీల్ మాదిగ, కనుకుంట్ల వెంకన్న మాదిగ, కొండపల్లి ఆంజనేయులు మాదిగ, ఎంఇఎఫ్ జిల్లా అధ్యక్షులు వల్లపట్ల కృష్ణ మాదిగ, ఎంఇఎఫ్ నాయకులు దున్న శ్యామ్ బట్టు గోపి మాదిగ న్యాయవాదులు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు డప్పు మల్లయ్య మాదిగ, దాసరి వెంకన్న మాదిగ ములకలపల్లి మల్లేష్ మాదిగ, గ్యార కనకయ్య మాదిగచింత సతీష్ మాదిగ, నాయకులు మేడి కృష్ణ మాదిగ, సిరిపంగి లింగస్వామి మాదిగ ములుగురి రాజు మాదిగ, కొండేటి గోపి మాదిగ గుగ్గిళ్ళ సామ్సన్ మాదిగ, మోహన్ మాదిగ, గంట భిక్షపతి, మిరియాల చిన్ని మాదిగ, మొండికత్తి గోపీచంద్, గట్టు గోపి మాదిగ, విద్యాసాగర్ మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



