కేటీఆర్ తో ఉప్పు కృష్ణ భేటి

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మునుగోడు నియోజకవర్గ యువజన బీఆర్ఎస్ నాయకులు ఉప్పు కృష్ణ మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తో  కేటీఆర్ ను తెలంగాణ భవన్ లో ఆదివారం కలిశారు.మునుగోడు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు శాయ శక్తుల పనిచేయాలని కేటీఆర్ చెప్పారని అన్నారు.మరొకసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యమకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారని ఉప్పు కృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో బోయిని వెంకటేష్,తూర్పింటి గణేష్, భూతం లింగస్వామి,పల్చం శ్రీకాంత్,బైసెట్టి శివ పాల్గొన్నారు
Spread the love