- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
నవతెలంగాణ క్యాలెండర్ ను గురువారం కామారెడ్డి డిఆర్డిఏ పీడీ సురేందర్ తన కార్యాలయంలో విలేకరులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాల్ని నిర్భయంగా రాస్తూ ప్రజలు కలిగే ఇబ్బందులను ప్రభుత్వ అధికారులకు గుర్తు చేస్తూ వారి సమస్యలను పరిష్కరించడంలో నవతెలంగాణ ముఖ్యపాత్ర పాత్ర పోషిస్తుందన్నారు. ముందు ముందు మరిన్ని వార్తలను, కథనాలను రాస్తూ పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డివిజన్ ఇంచార్జ్ మేతుకు నరేష్ , కామారెడ్డి విలేకరి డాకురి మోహన్, రామారెడ్డి విలేఖరి తిరుపతిరెడ్డి, సదాశివ నగర్ విలేఖరి లింగం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



