ఇంగ్లండ్‌కు ఊరట

A relief to England–  వరుసగా ఐదు ఓటముల తర్వాత ఓ గెలుపు
– స్టోక్స్‌ సెంచరీ
– నెదర్లాండ్స్‌పై 160పరుగుల తేడాతో ఘన విజయం
పూణే: ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టుకు ఊరట లభించింది. వరుస ఐదు ఓటములకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది. మహరాష్ట్ర క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియంలో నెదర్లాండ్స్‌పై 160పరుగుల భారీ తేడాతో గెలిచింది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 339పరుగులు చేయగా.. అనంతరం నెదర్లాండ్స్‌ను 37.2ఓవర్లలో 179పరుగులకు ఆలౌట్‌ చేసింది. దీంతో ఈ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్‌ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. ఏడో ఓవర్లో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టో(15) వికెట్‌ను కోల్పోయింది. కానీ మరో ఓపెనర్‌ మలన్‌ మాత్రం ఫోర్లతో విరుచుకుపడ్డాడు. వాన్‌ బీక్‌ వేసిన రెండో ఓవర్లోనే హ్యాట్రిక్‌ ఫోర్లు కొట్టిన మలన్‌.. ఆర్యన్‌ దత్‌ వేసిన మూడో ఓవర్లో కూడా రెండు బౌండరీలు సాధించాడు. వాన్‌ బీక్‌ వేసిన 8వ ఓవర్లో మూడు బౌండరీలు బాదాడు. 36బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసిన మలన్‌.. రెండో వికెట్‌కు జో రూట్‌(28)తో కలిసి 85 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లండ్‌ జట్టు 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 2వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. వాన్‌ బీక్‌ వేసిన 21వ ఓవర్లో తన ట్రేడ్‌ మార్క్‌ షాట్‌ వేసిన బంతినిరివర్స్‌ స్వీప్‌ ఆడబోయిన రూట్‌.. క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ఓపెనర్‌ డేవిడ్‌ మలన్‌ (87; 74 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లు)తో మెరిసినా.. హ్యారీ బ్రూక్‌(11), కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌(5), మొయిన్‌ అలీ(4) తక్కువ స్కోర్లకే పెవీలియన్‌కు చేరారు. 192 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను బెన్‌స్టోక్స్‌ సెంచరీతో ఆదుకున్నాడు. బెన్‌ స్టోక్స్‌(108; 84 బంతుల్లో, 6ఫోర్లు, 6సిక్సర్లు)కి తోడు ఏడో స్థానంలో వచ్చిన క్రిస్‌ వోక్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు 81బంతుల్లో 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 58బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన స్టోక్స్‌.. ఆర్యన్‌ దత్‌ వేసిన 45వ ఓవర్లో 4, 6, 6, 6తో 80లలోకి వచ్చాడు. బస్‌ డే లీడె వేసిన 47వ ఓవర్లో 4, 6 కొట్టి 90లలోకి వచ్చిన స్టోక్స్‌.. మరుసటి ఓవర్లో బౌండరీ కొట్టి ఈసారి ప్రపంచకప్‌లో తన తొలి సెంచరీని సాధించాడు. 58 బంతుల్లో అర్థ సెంచరీ చేసిన స్టోక్స్‌.. తర్వాత 50 పరుగులు చేయడానికి 20 బంతులే తీసుకున్నాడు. వోక్స్‌ కూడా లీడె వేసిన 49వ ఓవర్లో 6, 4 కొట్టి 44 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేశాడు. వోక్స్‌(51; 45బంతుల్లో 5ఫోర్లు, సిక్సర్‌) అర్ధసెంచరీ చేశాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లీడెకు మూడు, వాన్‌ బీక్‌, ఆర్యన్‌ దత్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ను ఓపెనర్‌ విస్ట్లే (37) రాణించినా.. ఓవర్డ్స్‌(5), అకెర్మన్‌(0) నిరాశపరిచారు. ఆ తర్వాత సైబ్రాడ్‌(33), ఎడ్వర్డ్స్‌(38), తేజ నిడమానూరు(41నాటౌట్‌) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీకి మూడేసి, విస్ట్లేకు రెండు వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ బెన్‌ స్టోక్స్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు…
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి)మీకెరన్‌ (బి)ఆర్యన్‌ దత్‌ 15, మలన్‌ (రనౌట్‌) వాన్‌బిక్‌/ఎడ్వర్డ్స్‌ 87, రూట్‌ (బి)వాన్‌ బీక్‌ 28, స్టోక్స్‌ (సి)సైబ్రాండ్‌ (బి)వాన్‌ బీక్‌ 108, హారీ బ్రూక్‌ (సి)మీకెర్మన్‌ (బి)డీ-లీడే 11, బట్లర్‌ (సి)తేజ నిడమానూరు (బి)వాన్‌ మీకెరన్‌ 5, మొయిన్‌ (సి)లీడే (బి)ఆర్యన్‌ దత్‌ 4, వోక్స్‌ (సి)ఎడ్వర్డ్స్‌ (బి)డీ-లీడే 51, విల్లీ (సి)సైబ్రాండ్‌ (బి)డీ-లీడే 6, అట్కిన్సన్‌ (నాటౌట్‌) 2, ఆదిల్‌ రషీద్‌ (నాటౌట్‌) 1, అదనం 21. (50 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి) 339పరుగులు.
వికెట్ల పతనం: 1/48, 2/133, 3/139, 4/164, 5/178, 6/192, 7/321, 8/327, 9/334
బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 10-0-67-2, వాన్‌ బీక్‌ 10-0-88-2, మీకెర్మన్‌ 10-0-57-1, డీ-లీడే 10-0-74-3, వాన్‌-డెర్‌-మెర్వ్‌ 3-0-22-0, అకెర్మన్‌ 7-0-31-0
నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: వెస్ట్లీ బర్రెసీ (రనౌట్‌) క్రిస్‌ వోక్స్‌/మొయిన్‌ 37, ఓవార్డ్‌ (సి)మొయిన్‌ (బి)వోక్స్‌ 5, అకెర్మన్‌ (సి)బట్లర్‌ (బి)విల్లీ 0, సైబ్రాండ్‌ (సి)వోక్స్‌ (బి)విల్లీ 33, ఎడ్వర్డ్స్‌ (సి)మలన్‌ (బి)మొయిన్‌ 38, లీడే (బి)ఆదిల్‌ రషీద్‌ 10, తేజ నిడమానూరు (నాటౌట్‌) 41, వాన్‌ బీక్‌ (సి)మలన్‌ (బి)ఆదిల్‌ రషీద్‌ 2, వాన్‌-డెర్వ్‌-మెర్వ్‌ (సి)రషీద్‌ (బి)మొయిన్‌ 0, ఆర్యన్‌ దత్‌ (బి)రషీద్‌ ఖాన్‌ 1, వాన్‌-మీకెర్మన్‌ (స్టంప్‌)బట్లర్‌ (బి)మొయిన్‌ 4, అదనం 8. (37.2ఓవర్లలో ఆలౌట్‌) 179పరుగులు.
వికెట్ల పతనం: 1/12, 2/13, 3/68, 4/90, 5/104, 6/163, 7/166, 8/167, 9/174, 10/179
బౌలింగ్‌: వోక్స్‌ 7-0-19-1, విల్లీ 7-2-19-2, అట్కిన్సన్‌ 7-0-41-0, మొయిన్‌ అలీ 8.2-0-42-3, ఆదిల్‌ రషీద్‌ 8-0-54-3.

Spread the love