Saturday, January 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట 

గంగపుత్రుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట 

- Advertisement -

సిద్దిపేట జిల్లా ఫిషర్ కమిటీ ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్ 
నవతెలంగాణ – చిన్నకోడూరు 

తెలంగాణ ప్రభుత్వం గంగపుత్ర సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని సిద్దిపేట జిల్లా ఫిషర్ కమిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్ అన్నారు. గురువారం గంగపుత్ర చైతన్య సమితి ఆధ్వర్యంలో హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కళావేదికలో నిర్వహించినటువంటి గంగపుత్రుల సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ చైర్మన్  మెట్టు సాయి కుమార్ పాల్గొని సన్మానం నిర్వహించినారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫిషరీస్ ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర చైతన్య సమితి అధ్యక్షులు మంగిలపల్లి శంకర్ గంగపుత్ర మన ఆలోచన సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుడిసె ప్రభు రాజ్ గంగపుత్ర ,దేశెట్టీ బిక్షపతి, సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఉపసర్పంచులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -