నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి మాత జయంతి వేడుకలను స్థానిక చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. వాసవి మాత చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అలాగే గ్రామంలో జయంతి సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు వాసవి మాత చిత్రపటానికి తాడిచెర్ల లోని వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైశ్య సంఘం మండల అధ్యక్షుడు కుక్కుడపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతిని అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సభ్యులు వొళ్ళాల వరప్రసాద్, కుక్కుడపు అశోక్, రేపాల హరీష్ కుమార్, వొళ్ళాల రమేష్, కొడిమ్యాల భాస్కర్, కుక్కుడుపు సత్యనారాయణ, రేపాల ధనుంజయ, వొళ్ళాల నాగరాజు,రేపాల సాయి పాల్గొన్నారు.
తాడిచెర్లలో వైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవిమాత జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -



