Sunday, April 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమం 

వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవ కార్యక్రమం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం యందు 333వ ఆరాధన ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ పురోహితులు ఈశ్వర చారి ఉదయం అర్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, గంగాధర్ సంఘ సభ్యులు ప్రణీత్, తిరుమలేష్, సాగర్, చంద్రయ్య, జగన్, కార్తీక్ ,విశాల్ ,గోవర్ధన్, రమేష్, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -