నవతెలంగాణ – భువనగిరి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాతా జయంతి ఉత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కరరావు మాట్లాడుతూ .. ఆర్యవైశ్య సంఘాలఅభ్యర్థన మేరకు, వాసవీ మాత జయంతిని (వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి) రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ నిర్ణయంతో 26 ఏప్రిల్ 2026న, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాలలో ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు జరగుతున్నాయని తెలిపారు.
అనంతరం జిల్లా యువజన, క్రీడాల అధికారి శ్రీ కే ధనంజనేయులు మాట్లాడుతూ.. వాసవీ మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వాసవి సంఘం అధ్యక్షలు బిజ్జాల మహేష్, రీజనల్ కార్యదర్శి ఆకుల రమేష్, నాయకులు జై హనుమంతరావు, పసుపునురి మనోహర్, ఎన్ వెంకటేశ్వర్లు, ఎస్ కృష్ణమూర్తి, జి శ్రీనివాస్ పి సోమన్న కే రాజేందర్ పాల్గొన్నారు.



