Monday, April 27, 2026
E-PAPER
HomeఆటలుIPL-2026: ర‌ఘువంశీకి భారీ జ‌రిమానా

IPL-2026: ర‌ఘువంశీకి భారీ జ‌రిమానా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ బ్యాట‌ర్ అంగ్‌క్రిష్ ర‌ఘువంశీకి భారీ జ‌రిమానా ప‌డింది. ల‌క్నోతో ఆదివారం జ‌రిగిన మ్యాచ్‌లో అత‌ను ఫీల్డింగ్‌కు అడ్డుప‌డిన‌ట్లు తేలింది. ఆ మ్యాచ్ 5వ ఓవ‌ర్‌లో మిడాన్ దిశ‌గా బంతిని కొట్టి ప‌రుగు కోసం వెళ్లాడు. అయితే నాన్‌స్ట్ర‌యిక‌ర్ అత‌న్ని తిప్పిపంపాడు. ఆ క్ర‌మంలో వికెట్ల వైపు ప‌రుగెత్తిన ర‌ఘువంశీ.. ఫీల్డ‌ర్ బంతిని త్రో చేస్తున్న దిశ‌లో ప‌రుగెత్తాడు. దీంతో థార్డ్ అంపైర్ కేకేఆర్ బ్యాట‌ర్‌ను ఔట్‌గా ప్ర‌క‌టించాడు. ఫీల్డింగ్‌కు అడ్డుప‌డిన‌ట్లుగా పేర్కొన్నారు. అయితే మ్యాచ్ ఫీజులో 20 శాతం జ‌రిమానా విధించారు. ర‌ఘువంశీకి ఓ డీమెరిట్ పాయింట్ కూడా జ‌త‌క‌లిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -