నవతెలంగాణ-కంఠేశ్వర్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ సంతాప సభ విజయవంతం చేయండి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. ఈనెల 28న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు నూర్జహాన్ సమస్మరణ సభను న్యూ అంబేద్కర్ భవన్లో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్మరణ సభకు పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా వామపక్ష పార్టీల నాయకులు హాజరవుతున్నారని వెల్లడించారు. అదేవిధంగా ఈ సంతాప సభకు జిల్లాలోని పార్టీ సభ్యులు, సానుభూతిపరులు ప్రజాసంఘాల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనేక మంది పేద ప్రజల సమస్యల పైన ఎన్నో ఉద్యమాలు పోరాటాలు నిర్వహించారని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, జిల్లా కేంద్రంలో భూపోరటం నిర్వహించటంతో, పాటు సాగు భూముల కోసం జరిగిన పోరాటంలో ఆమె ప్రముఖ పాత్ర వహించి అనేక కేసులు, జైల్ శిక్షను అనుభవించారని గుర్తు చేశారు. అదేవిధంగా హైదరాబాదులో జరిగిన నిరవధిక నిరాహార దీక్షలో వారం రోజులకు పైగా నిరాహార దీక్షలో పాల్గొని తన పోరాట పట్టిమను చూపెట్టారని అన్నారు. అనేక కార్మిక వర్గ పోరాటాల్లో అగ్రభాగాన ఉండి ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు. అందువల్ల ఆమె ప్రజా ఉద్యమాల్లో ఉంటూనే ప్రాణాలు కోల్పోయినందున సీపీఐ(ఎం) ఆమెకు ఘనంగా నివాళులు అర్పించడం కొరకు 28వ తేదీన సంస్మరణ సభను నిర్వహించాలని జిల్లా కమిటీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఈ సమస్మరణ సభకు పార్టీ సభ్యులు, సానుభూతిపరులు, శ్రేయోభిలాషులు, పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు ,పల్లపు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



