Monday, April 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం

తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ-నాచారం
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాచారంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కోట్లాది ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేసిన మహానేత కేసీఆర్ నాయకత్వమే రాష్ట్ర సాధనకు దారి తీసిందని పేర్కొన్నారు.

ఉద్యమకారుల నిరంతర పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందువల్లే ప్రజాప్రతినిధులుగా సేవ చేసే అవకాశం తమకు దక్కిందని తెలిపారు. నాచారం మాజీ కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం లో స్థానిక ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేడల మల్లికార్జున గౌడ్, వేముల మారయ్య, మేకల ముత్యం రెడ్డి, దేవులపల్లి యాదగిరి, మంగోలి శివ, రెబల్ రాజ్, తిప్పర్తి రాజబాబు, గుండు రమేష్ గౌడ్, భూపాల్ రెడ్డి, జంగం అశోక్, గౌడెల్లి రామకృష్ణ, బొడ్డు శివ తదితరులు పాల్గొన్నారు. స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేను అభినందిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -