- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని మాదాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశా చందర్ పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అనంతరం సర్పంచ్ ఆశా పాటిల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించిందని అన్నారు. ప్రస్తుతం గ్రామాలలో సంక్షేమ పథకాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ జిపి పాలకవర్గం సభ్యులు, గ్రామస్థాయి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



