Monday, April 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాలో ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి

రష్యాలో ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్జి సోమవారం రష్యాలో పర్యటించనున్నారు. నేడు అరాఘ్చి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌లిరువురూ తీవ్రమవుతున్న యుద్ధంపై చర్చలు జరపున్నారని క్రెమ్లిన్‌ ‌అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌వెల్లడించిన కాల్పుల విరమణ, అనంతరం ఇరాన్‌ నౌకలపై విధించిన దిగ్భంధనం, అసలు ప్రస్తుతం గల్ఫ్‌‌లో జరుగుతున్న సంఘర్షణలు.. ప్రస్తుత పరిస్థితులపై రష్యా అధికారులతో అరాఘ్చి సంప్రదింపులు జరిపేందుకు ప్రణాళిక వేసినట్లు మాస్కోలో ఇరాన్‌ రాయబారి కజెమ్ జలాలీ పేర్కొన్నారు. రష్యా – ఇరాన్‌‌లు ద్వైపాక్షిక సంబంధాలలోనూ, అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఏకాభిప్రాయంతో ఉన్నాయి. దీంతో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అగ్రనేతలు, ఉన్నతాధికారులు చర్చలు జరపున్నారని జలాలీ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -