Monday, April 27, 2026
E-PAPER
Homeక్రైమ్విద్యుత్ షాక్ తో మహిళ మృతి

విద్యుత్ షాక్ తో మహిళ మృతి

- Advertisement -

నవతెలంగాణ-తుంగతుర్తి
విద్యుత్ షాక్ తో వివాహిత మృతి చెందిన సంఘటన తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గొట్టిపర్తి గ్రామానికి చెందిన చింతకుంట్ల పున్నమ్మ సోమవారం ఉదయం తన ఇంటి దగ్గర ఉన్న మోటార్ వేయడానికి కరెంట్‌ బోర్డులో ప్లగ్ పెడుతుండగా ఒక్క‌సారిగా షాక్‌కు గురై కింద‌ పడిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు పున్నమ్మను ఆస్పత్రికి త‌ర‌లించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించాలి. పున్న‌మ్మకు భర్త చంద్రయ్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇరువురి కూతుర్ల‌కు పెళ్లిళ్లు అయినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -