మాజీ చండూరు ఎంపీపీ తోకల వెంకన్న
నవతెలంగాణ – చండూరు
రాష్ట్ర ప్రజల సమస్యల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ నిలబడిందని మాజీ ఎంపీపీ తోకల వెంకన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలను సోమవారం ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొత్తపాటి సతీష్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీగా ఏర్పడిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రారంభించి, ఇది కేవలం వ్యక్తి పార్టీ కాకుండా, తెలంగాణ అంచనాలు నిధులు–నీళ్లు–నియామకాలు అనే చైతన్యం కలిగిన ప్రజా పార్టీగా రూపాంతరం చెందిందని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసి, దశాబ్దాల కలను 2014లో నిజం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కురుపాటి సుదర్శన్, మాదగోని వెంకటేశం, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న గౌడ్, కౌన్సిలర్లు కొండ్రెడ్డి మధు, బీఆర్టీయూ పట్టణ అధ్యక్షుడు చొప్పరి దశరథ, సర్పంచులు కొండ రజిత రవి, ఉజ్జిని ఉష అనిల్ రావు, నారపాక వసంత ధనయ్య, ఆలేటి యాదయ్య, దామెర రాములు, మహమ్మద్ మహబూబ్,సుంకరి సత్తయ్య, చిలువేరు నరేష్, బేరి చంద్రశేఖర్, , భూతరాజు వెంకన్న పాల్గొన్నారు.



