Monday, April 27, 2026
E-PAPER
Homeఆదిలాబాద్బాసర అధ్యాపకుడికి పిహెచ్ డి ప్రదానం

బాసర అధ్యాపకుడికి పిహెచ్ డి ప్రదానం

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్ 
బాసర రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎ. సాయినాథ్ చైతన్యకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పిహెచ్.డి పట్టా ప్రదానం చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ  ప్రతిష్టాత్మకమైన ‘విశ్వేశ్వరయ్య పిహెచ్.డి స్కీమ్’ను ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా నిర్వహించిన ప్రవేశ పరీక్షలో సాయినాథ్ చైతన్య అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ఆల్ ఇండియా రెండవ ర్యాంకు  సాధించారు. దింతో  ఆయన సాధించిన ఈ ఉత్తమ ర్యాంకు ఆధారంగా, హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు తమ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో సాయినాథ్ చైతన్యకు పిహెచ్.డి. సీటును కేటాయించారు.

ఓ.యు.ఇ.సి.ఇ విభాగం ప్రొఫెసర్ ఎల్. నిర్మల దేవి పర్యవేక్షణలో ఆయన తన పరిశోధనను పూర్తి చేశారు. “ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ నాణ్యత నియంత్రణను మెరుగుపరచడానికి కంప్యూటర్ విజన్ పద్ధతులు” (కంప్యూటర్ విజన్ టెక్నిక్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్)అంశంపై ఆయన చేసిన పరిశోధనకు ఈ అత్యున్నత డిగ్రీ లభించింది. సాయినాథ్ చైతన్య తన పరిశోధనలో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎస్.సి.ఐ , స్కోపస్  ఇండెక్స్ చేయబడిన జర్నల్స్‌లో పలు పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

ఈ సందర్భంగా ఆర్.జి.యు.కె.టి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్,సాయినాథ్ చైతన్యను ప్రత్యేకంగా అభినందించారు. యూనివర్సిటీ అసోసియేట్ డీన్లు, వివిధ విభాగాల అధ్యాపకులు, సిబ్బంది ఆయన సాధించిన ఈ విజయానికి హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -