Sunday, June 7, 2026
E-PAPER
Homeజిల్లాలువెల్టూరులో పడకేసిన 99 రోజుల ప్రణాళిక

వెల్టూరులో పడకేసిన 99 రోజుల ప్రణాళిక

- Advertisement -

– పైపుల లీకేజీలతో రోడ్లపైకి మురుగునీరు – కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులు
నవతెలంగాణ – ఉప్పునుంతల 

ఉప్పునుంతల మండలం వెల్టూరు గ్రామంలోని ఒక కాలనీలో ప్రజాపాలన పూర్తిగా పడకేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన 99 రోజుల ప్రణాళిక ప్రజలకు కలగానే మిగిలిపోయింది. గ్రామంలో త్రాగునీటి పైపులు లీకేజీ అవుతూ ఉండటంతో శుద్ధజలం బదులు మురుగునీరు కలిసిపోతూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి.

కాలనీలో పైపు లీకేజీ కారణంగా మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ దుర్వాసన వ్యాపిస్తోంది. చిన్నారులు, వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం నెలకొంది. తక్షణమే లీకేజీ పైపులను మరమ్మతు చేసి పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -