జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్
నవతెలంగాణ – మిడ్జిల్
ఆరుగాలం కష్టపడి చేతికొచ్చిన 6 ఎకరాల మొక్కజొన్న పంట ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని బూడిదైందని, ఆ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ అన్నారు. పంట నష్టపోయిన రైతులను చెందిన కుమ్మరి రాములు, నాగేష్, రవి రైతుల కాలిపోయిన మొక్కజొన్న పంటను రైతులతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులు సాగు చేసిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలి బూడిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరుమున్నీరవుతున్నారని ఆయన వాపోయారు.
పెద్ద ఎత్తున పంట కాలి బూడిదవడంతో రైతులు భారీగా నష్ట పోయారని అన్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంట కాలిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని రైతు ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి, మండల అధ్యక్షుడు నరేష్ నాయక్, మండల ఉపాధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు శేఖర్,నవీన్,శివాజీ,యాదయ్య,నరేష్ చారి,రైతులు తదితరులు పాల్గొన్నారు.



