Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

- Advertisement -

రైతు పండించిన చివరి గింజ వరకు తన ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..
మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

రైతులు రాజులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని రైతు పండించిన చివరి గింజను కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ తెలిపారు. మంగళవారం వావిలాల  గ్రామ సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్ తహసిల్దార్ చందా నరేష్  కలిసి పిఎసిఎస్ శ్రీరామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు పెద్దపీట వేసిందని అన్నారు.

అంతేకాకుండా రైతులు పండించిన వారి ధాన్యం పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ని కూడా ఇస్తుందని తెలిపారు. రైతు భరోసా నిధులు కూడా ఇస్తుందని అంతేకాకుండా రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు కేంద్రనికి తీసుకురావాలని ప్రభుత్వం ఇచ్చిన మద్దతు ధరకే అమ్ముకోవాలని కోరినట్లు చెప్పారు.  దళారుల మాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు. వరి విక్రయించే రైతులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా తగు జాగ్రత్తలు నిర్వహకులు వహించాలని ఆదమరిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరించారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గోగుల మమత ప్రశాంత్, రాంసింగ్, విజయ, ఉప సర్పంచ్ ఎల్లమ్మ, శ్రీరామ గిరి సర్పంచ్, మదారి ప్రశాంత్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాదవ రెడ్డి, జిల్లా నాయకుడు కాసం లక్ష్మారెడ్డి, మండలపార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, నాయకులు కాలేరు మల్లేశం, కాసం లక్ష్మారెడ్డి, నల్ల మాస శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు గోగుల అశోక్, బొల్లెపల్లిసతీష్, తవిశెట్టి రాకేష్ , సీఈవో కత్తుల వెంకన్న, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -