వంద శాతం ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత
శుభాకాంక్షలు తెలిపిన స్పెషల్ ఆఫీసర్ మెరుగు భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎస్.ఎస్.సి ఫలితాల్లో పరీక్ష ఫలితాల్లో మండలం దుబ్బపేటలోని కస్తూర్బాగాంధీ విద్యార్థులు వందశాతం ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి విజయభేరీ మోగించారు. ఇందుకు పాఠశాల స్పెషల్ అధికారి మెరుగు భవాని విద్యార్ధినిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యాలయంలోని 47 మంది విద్యార్థినిలు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా విడుదలైన ఫలితాల్లో 47 మంది విద్యార్థినిలు ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యారని తెలిపారు. ఉత్తమమైన ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు, అధ్యపక బృందానికి, సహకరించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. 20 మంది పైగా విద్యార్థినిలు 500కు పైగా మార్కులు సాధించడం జరిగిందన్నారు. బోయిని సిరివెన్నెల 560 మార్కులు సాధించి పాఠశాల టాపర్ గా నిలిచారని తెలిపారు. రాబోయే విద్య సంవత్సరంలో డిఈవో రాజేందర్ మండల విద్యాధికారి లక్ష్మణ్ బాబు, జీసీడివో శైలజ సహకారంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యార్థినీలను జిల్లాలోనే ప్రథమ స్థాయిలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు.
పది ఫలితాల్లో కెజీబీవీ విద్యార్థుల విజయభేరీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



