గోపాలకష్ణ దొండపాటి సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ బ్యానర్ పై హీరోయిన్ భావన ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ‘హంట్’. తెలుగులో ఈ చిత్రం ‘డాక్టర్ కీర్తి’ ఎంబీబీ ఎస్ ఎంఎస్ అనే పేరుతో అనువాదమవు తోంది. మలయాళ దర్శకుడు షాజీ కైలాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని స్వర్ణ క్రియేషన్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పీవీఆర్ సినిమాస్‌తో భారీ ఎత్తున మే 8న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం విశ్వనాథ్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు.చిత్ర నిర్మాతలు స్వర్ణకుమారి దొండపాటి, ఎం.విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ,’కోల్‌కత్తాలో సంచలనం సష్టించిన డాక్టర్ రేప్ మర్డర్ కేసు ఆధారంగా ప్రముఖ దర్శకుడు షాజీ కైలాస్ అద్భుతంగా తెరకెక్కించిన సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు జరిగిన ఆ సంఘటన పట్ల ప్రపంచం అంతా నివ్వెరపోయింది. డాక్టర్ పాత్రలో నటి భావన నటించారు. ఆమె ఫెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రంలోని ఎమోషన్ ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. ఇక కైలాష్ మీనన్ సంగీతం సినిమాకి హైలెట్‌గా ఉంటుంది. పీవీఆర్ ద్వారా మే 8న మా చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నాం. మలయాళంలో సంచలన విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ‘యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు షాజీ కైలాస్ ఈ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించారు. మహిళలకు రక్షణ లేని ఈ సమాజంలో వెస్ట్ బెంగాల్‌లో ఒక డ్యూటీ డాక్టర్ ఎదుర్కొన్న విషాదకర ఘటన మనందరినీ కలిచివేసింది. ఆ వైద్యురాలి ఆత్మ తన బాధను చెబితే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీలో దర్శకుడు తెరకెక్కించారు’ అని నటి కవిత చెప్పారు. ప్రొడ్యూసర్ లయన్ సాయివెంకట్ మాట్లాడుతూ,’ఈ సినిమా చూశాను. మూవీ చూస్తూ కథలో లీనమైపోయాను. ఈ మూవీ చూడగానే పీవీఆర్ వాళ్లు రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారంటే ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు’ అని తెలిపారు. రెంజి పనికర్, చందునాథ్, డెయిన్ డేవిస్, అను మోహన్, అజ్మల్ అమీర్, అదితి రవి, తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి డైలాగ్స్- ఎం. రాజా శేఖర్ రెడ్డి, ఎడిటింగ్- అజాస్ పుక్కడన్, సినిమాటోగ్రఫీ – జాక్సన్ జాన్సన్, మ్యూజిక్ – కైలాస్ మీనన్, రచన – నిఖిల్ ఆనంద్.
వాస్తవ సంఘటనతో ‘డాక్టర్ కీర్తి’
- Advertisement -
- Advertisement -



