Thursday, April 30, 2026
E-PAPER
Homeసినిమాపవర్‌ఫుల్‌ పాత్రలో మంజుల మనవరాలు

పవర్‌ఫుల్‌ పాత్రలో మంజుల మనవరాలు

- Advertisement -

అలనాటి అగ్ర కథానాయికగా మంజుల కూతురు వనితను ‘దేవి’తో నటిగా పరిచయం చేశారు నిర్మాత ఎంఎస్‌ రాజు. ఇప్పుడు మంజుల మనవరాలు, వనిత కుమార్తె జోవికా విజరు కుమార్‌ను ‘అగధ’తో నటిగా పరిచయం చేస్తున్నారాయన. ఇందులో ఆమె పాత్ర పేరు ‘హరిణి’. ఆమె క్యారెక్టర్‌ పోస్టర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ విడుదల చేసిన అన్ని పోస్టర్లు ఈ సినిమా తాలూకు ఇంటెన్సిటీని ఆవిష్కరించే విధంగా ఉన్నాయి. ఎం. ఎస్‌. రాజు రచన, దర్శకత్వంలో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. 85 రోజుల షూటింగ్‌, విస్తతమైన సెట్‌ వర్క్‌, దాదాపు 45 నిమిషాల విఎఫ్‌ఎక్స్‌తో ‘అగధ’ ఒక ప్రత్యేకమైన సినిమాటిక్‌ అనుభూతిని అందిస్తుందని యూనిట్‌ చాలా నమ్మకంగా ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ చిత్రానికి సంగీతం: రాకేష్‌ వెంకటాపురం, సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రాజీవ్‌ నాయర్‌, అదనపు స్క్రీన్‌ ప్లే: చైతన్య వేగి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎన్‌ వి ఎన్‌ సుబ్బరాజు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -