సూపర్ స్టార్ కష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్‌తో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. అజరు భూపతి దర్శకుడిగా, అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. హీరో నాని ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ‘అలెల్లె అలెల్లె’ను లాంచ్ చేశారు. కొన్ని పాటలు కేవలం బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తాయి. కొన్ని పాటలు కథ నుంచి వస్తాయి. ‘అలెల్లె అలెల్లె’ అలాంటి ప్రత్యేకమైన పాట. జివి ప్రకాష్ కుమార్ అద్భుతంగా కంపోజ్ చేసిన ఈ సాంగ్ వినగానే ఆకట్టు కుంటుంది. మొదట మెలోడియస్‌గా మొదలై, తర్వాత ఉత్సాహ భరితమైన ట్రాక్‌గా అలరిస్తుంది. ప్రతి నోట్ మనసుని తాకుతోంది. శ్రీమణి రాసిన సాహిత్యం ప్రేమలో ఉండే ఆ మధురమైన ఎమోషన్‌ని అద్భుతంగా వ్యక్తపరుస్తుంది. ప్రతి ఫీలింగ్ కొత్తగా, ప్రతి క్షణం మ్యాజిక్‌లా అనిపించే అనుభూతిని అందిస్తుంది. జివి ప్రకాష్ కుమార్, హరి ప్రియా వోకల్స్ ఈ పాటకు మరింత బ్యూటీ జోడించాయి. వారి వోకల్స్ రెండు మనసులు కలిసిన ఫీలింగ్‌ని క్రియేట్ చేశాయి. జయకష్ణ, రషా జోడి ఈ పాటకు ప్రాణం పోసారు. వారి కెమిస్ట్రీ ఎంతో సహజంగా ఉంది. అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన విజువల్స్ ఈ పాటను ఒక మధురమైన జ్ఞాపకంలా మార్చాయి అని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం షూటింగ్ తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. జయ కష్ణ ఘట్టమనేని, రాషా తడాని, మోహన్ బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన- దర్శకత్వం: అజరు భూపతి, సమర్పణ: అశ్విని దత్, నిర్మాత: పి.కిరణ్, డీఓపీ : జయకష్ణ, ఎడిటర్: మాధవ్ కుమార్ గుళ్లపాటి, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాకమూరి నారాయణ స్వామి, ఫైట్స్: రియల్ సతీష్.



