Friday, May 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంశ్రీచైతన్య రికార్డు స్థాయి ఫలితాలు

శ్రీచైతన్య రికార్డు స్థాయి ఫలితాలు

- Advertisement -

10వ తరగతిలో
597 టాప్‌ మార్కులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
శ్రీచైతన్య స్కూల్‌ ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో రికార్టు స్థాయి ఫలితాలను నమోదు చేసింది. మొత్తం 600 మార్కులకుగాను టాప్‌ మార్కులు 597ను శ్రీచైతన్య స్కూల్‌ విద్యార్థికి వచ్చినట్టు శ్రీచైతన్య స్కూల్‌ డైరెక్టర్‌ సీమ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీచైతన్య విద్యార్థులకు వచ్చిన ఫలితాల వివరాలను వెల్లడించారు. 580 మార్కులకుపైగా 829 మంది, 570 మార్కులకుపైగా 2,303 మంది, 560 మార్కులకుపైగా 3,954 మంది, 550 మార్కులకుపైగా 5,521 మంది సాధించారు. సబ్జెక్టుల వారీగా ఏ గ్రేడ్లు. వచ్చిన వారిలో చూస్తే ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 11,302, సెకండ్‌ లాంగ్వేజ్‌ 12,380, ఇంగ్లీష్‌ 13,821, గణితం 12,226, సైన్స్‌ 13,273, సోషల్‌ 14,737తో మొత్తం ఎ గ్రేడ్లు 77,739.

శ్రీచైతన్య స్కూల్‌ దాదాపు సగటు మార్కులు 532 సాధించిందనీ, మొత్తం ఉత్తీర్ణత శాతం 99.7 శాతంగా నమోదైందని సీమ తెలిపారు. శ్రీచైతన్యకు చెందిన 132 బ్రాంచ్‌లు వంద శాతం ఫలితాన్ని సాధించాయి. సబ్జెక్టుల వారీగా 100కు 100 మార్కులను 2,441 మంది విద్యార్థులకు వచ్చాయి. వీరిలో మ్యాథ్య్స్‌ లో 1,647, సోషల్‌ 357, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 259, సెకెండ్‌ లాంగ్వేజ్‌ 105 మంది ఉన్నారు. మెజారిటీ జిల్లాలు, మండలాలు, పట్టణాలు, నగరాల్లో శ్రీచైతన్య స్కూల్‌ టాప్‌ మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో కూడా ఆల్‌ ఇండియా ఓపెన్‌ క్యాటగిరీలో శ్రీచైతన్య స్కూల్‌ విద్యార్థులు 100లోపు 12 ర్యాంకులు, వెయ్యి లోపు 77 ర్యాంకులు సాధించారనీ, సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాల్లోనూ తమ స్కూల్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు 500 మార్కులకు 499 మార్కులు సాధించారని గుర్తుచేశారు. ఓవరాల్‌గా వంద శాతం పాస్‌ సాధించామన్నారు. రాష్ట్రంలో మరే ఇతర విద్యా సంస్థ కూడా ఇంతటి భారీ విజయానికి సమీపంలో లేదని చెప్పారు. గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని ఆమె అభినందించారు.

పది ఫలితాల్లో ఏపీలో టాప్‌ మార్కులు 599 శ్రీచైతన్య విద్యార్థికి : డైరెక్టర్‌ సీమ

ఆంధ్రప్రదేశ్‌ 10వ తరగతి ఫలితాల్లో టాప్‌ మార్కులు 599 శ్రీచైతన్య స్కూల్‌ విద్యార్థికి వచ్చాయని ఆ స్కూల్‌ డైరెక్టర్‌ సీమ గురువారం ఒక ప్రకటన తెలిపారు. 598 ఆ పైన మార్కులు 18 మందికి, 597 ఆ పైన 64 మంది, 596 ఆ పైన 139 మంది, 595 ఆ పైన 258 మంది, 590 ఆ పైన| 1,245 మంది, 580 ఆ పైన మార్కులు 4,352 మంది విద్యార్థులకు వచ్చాయి.

సగటు మార్కులు 521 కాగా, మొత్తం ఉత్తీర్ణత 99 శాతం. వంద బ్రాంచీలు 100 శాతం ఫలితాలు సాధించాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే 100కు 100 వచ్చిన వారిలో ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 5,997, సెకండ్‌ లాంగ్వేజ్‌ 608, ఇంగ్లీష్‌ 14, మ్యాథ్స్‌ 4,470, సైన్స్‌ 1,247, సోషల్‌ 2,367 మొత్తం 14,703 మంది ఉన్నారు. 28 జిల్లాల్లో 21 జిల్లాల్లో (75 శాతం ) శ్రీ చైతన్య స్కూల్‌ మాత్రమే టాప్‌ మార్క్‌ సాధించింది. 64 శాతం మండలాల్‌, 77 శాతం టౌన్‌/సిటీల్లో శ్రీ చైతన్య స్కూల్‌ దే టాప్‌ మార్కులు. గొప్ప విజయానికి కారణమైన విద్యార్థులు, తల్లిదండ్రులు, బోధనా సిబ్బందిని సీమ అభిందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -