మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
ముంబయి : రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్‌పై భారీ జరిమానా పడింది. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్‌రూమ్‌లో రియాన్ పరాగ్ వేపింగ్ (దూమపానం) చేస్తూ కనిపించాడు. రియాన్ పరాగ్ ఈ సిగరేట్ కాల్చుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. ఫీల్డ్ అంపైర్లు తన్మరు శ్రీవాస్తవ, నితిన్ మీనన్‌లు ఈ అంశాన్ని మ్యాచ్ రిఫరీకి రిపోర్టు చేయలేదు. సోషల్ మీడియాలో పొగ తాగుతున్న దృశ్యాలు వైరల్ కావటంతో అంపైర్లు మ్యాచ్ రిఫరీకి నివేదించారు. ఐపీఎల్ క్రమశిక్షణా నియమావళి ఆర్టికల్ 2.21 ప్రకారం రియాన్ పరాగ్ లీగ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించాడని మ్యాచ్ రిఫరీ అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించాడు. రియాన్ పరాగ్ మ్యాచ్ రిఫరీ ఎదుట తప్పు అంగీకరించటంతో ఈ అంశంలో తదుపరి విచారణ ఉండదు. రియాన్ పరాగ్‌పై రూ.24 లక్షల జరిమానా విధించిన ఐపీఎల్ నిర్వాహకులు.. భవిష్యత్‌లో లీగ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది సహా ప్రాంఛైజీపై చర్యలు తీసుకొనే ఆలోచనలో ఉంది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌లో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే వీలుంది. రాజస్తాన్ రాయల్స్ టీమ్ మేనేజర్ రోమి బిందర్ మ్యాచ్ జరుగుతుండగా డగౌట్‌లో ఫోన్ వాడటంతో అతడిపైనా నిర్వాహకులు జరిమానా విధించటంతో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
పరాగ్‌కు జరిమానా
- Advertisement -
- Advertisement -



