Sunday, May 3, 2026
E-PAPER
Homeసినిమాఅధికారానికి ఉద్దేశం తోడైతే..?

అధికారానికి ఉద్దేశం తోడైతే..?

- Advertisement -

గత కొంత కాలంగా బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ వంటి క్రేజీ కాంబోలో ఓ సినిమా రూపొందనుందనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్‌ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. బాలకృష్ణ నటించబోయే ఎన్‌బికే 111 ప్రాజెక్ట్‌ను దర్శకుడు కొరటాల శివతో చేస్తుండటం ఎంతో సంతోషంగా ఉందని మేకర్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. బాలకష్ణ పవర్‌ఫుల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌కు సరిపోయేలా హై వోల్టేజ్‌ యాక్షన్‌ను సామాజిక అంశాలతో మేళవించే కొరటాల శివ ఒక బలమైన కథను సిద్ధం చేశారు. సినిమా అనౌన్స్‌మెంట్‌ నేపథ్యంలో రిలీజ్‌ చేసిన పోస్టర్‌పై కనిపించిన ‘అధికారానికి ఉద్దేశం తోడేతై.. అది ఉద్యమంగా మారుతుంది’ అనే ట్యాగ్‌లైన్‌ సినిమా ఎంత పవర్‌ఫుల్‌గా ఉండనుందో సూచిస్తోంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.
బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో విడుదలైన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -