హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా ‘భగవంతుడు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా ప్రొడ్యూసర్ రవి పనస నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో జి.జి.విహారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కు రెడీ అవుతోంది. శుక్రవారం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘శరణమన్న శరణం’ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాటకు హారు కే.పి స్ఫూర్తికరంగా కంపోజ్ చేయగా, సింగర్ కుమార వాగ్దేవి పాటలోని భావోద్వేగాలను పలికిస్తూ పాడారు. ఈ పాట గురించి మేకర్స్ మాట్లాడుతూ,’మన మట్టిలో ప్రతి పని ఒక అమ్మ దేవత సాక్షిగానే మొదలవుతుంది. పొలం గట్టున నాగలి సాగే ముందు ‘పోలేరమ్మ’ను, చెరువు కట్టపై అలు గులు పోసేటప్పుడు ‘గంగమ్మ’ను, కష్ట, సుఖాల్లో ‘ఎల్లమ్మ’ను స్మరించుకోవడం మన శ్రామిక సంస్కతిలో భాగం. ఈ అమ్మ దేవతలు శ్రామి కుల చెమట చుక్కల్లో తోడుండే ధైర్య రూపాలు. మన సంస్కతిలో అమ్మ దేవతల శరణు జొచ్చంది ఏ పనీ మొదలు కాదు. పూర్తి కాదు. అమ్మలకు, సబ్బండ వర్గాలకు ఘనమైన ట్రిబ్యూ టే మా ఈ ‘శరణమన్న శరణం’. ఇది ఈ దేశపు సబ్బండ కులాల పతాక గీతం’ అని అన్నారు.



