పీనట్ బటర్.. పల్లీ వెన్న తెలియని వారుండరు. చాలా మంది రోజూవారీ అవసరాలకు ఇంట్లో వినియోగిస్తుంటారు. దీని రుచి గురించి వేరే చెప్పక్కర్లేదు.. ఆరోగ్యానికీ పోషకాలను అందిస్తుంది. ఇందులో ప్రోటీన్, శరీరానికి అవసరమైన మంచి కొవ్వులు, పలు రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి శక్తిని అందిస్తాయి. అందుకే పీనట్ బటర్ ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా ఆరోగ్య నిపుణులు చెబుతారు. దీని ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
గుండె ఆరోగ్యానికి కొండంత అండ
పల్లీ వెన్నలో లభించే సహజ కొవ్వులు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. అవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాదు వేరుశెనగ వెన్నలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. వేరుశెనగ వెన్నలోని పోషకాలు, ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. వేరుశెనగ వెన్న బరువు నియంత్రణలో కూడా సహాయపడుతుంది.
మంచి నిద్రకు కాస్తింత పీనట్ బటర్..
రాత్రి పడుకునే ముందు ఒక చెంచా వేరుశెనగ వెన్న తినడం వల్ల కమ్మని నిద్ర పడుతుంది. ఇందుకు అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది మంచి నిద్రను కలిగిస్తుంది. వేరుశెనగ వెన్నలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి ఇది చాలా అవసరం. మంచి రాత్రి నిద్రకు, ఉదయం ఉత్సాహంగా మేల్కొనడంలో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది.
నిద్రకు ముందుఓ స్పూను….
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



