Sunday, May 3, 2026
E-PAPER
Homeసినిమా'పెద్ది' అద్భుతంగా వచ్చింది

‘పెద్ది’ అద్భుతంగా వచ్చింది

- Advertisement -

హీరో రామ్‌ చరణ్‌ నటిస్తున్న రూరల్‌ యాక్షన్‌ డ్రామా ‘పెద్ది’ చిత్రీకరణ మొత్తం పూర్తయింది. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సమర్పణలో వద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌మెంట్‌ ప్రెస్‌మీట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ మాట్లాడుతూ,”ఉప్పెన’ క్లైమాక్స్‌ చూసినప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్‌ ఎలాంటి సినిమా అయినా చేయగలడు అనిపించింది. బుచ్చిబాబు ఈ సినిమా కోసం మంచి స్క్రిప్ట్‌ రాశాడు. ఎమోషన్స్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ని అద్భుతంగా బ్యాలెన్స్‌ చేశాడు. అలాంటి బ్యాలెన్స్‌ పట్టుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి. ‘పెద్ది’ లాంటి కమర్షియల్‌ ఎమోషనల్‌ రైడ్‌ ఈ మధ్యకాలంలో రాలేదు. స్క్రీన్‌ పై సాంగ్స్‌ చూసినప్పుడు సినిమా వేరే లెవెల్‌లో అనిపించింది. రత్నవేలు గ్రేట్‌ విజువల్స్‌ ఇచ్చారు. చరణ్‌ని అద్భుతంగా చూపించినందుకు థ్యాంక్స్‌.

రీసెంట్‌గా రిలీజైన టీజర్‌ విజువల్స్‌ మామూలుగా లేవు. సతీష్‌ చాలా మంచి వ్యక్తి. ఆయన మొదటి సినిమాకే రామ్‌ చరణ్‌ లాంటి హీరో, బుచ్చిబాబు లాంటి దర్శకుడు దొరకడం ఆయన అదష్టం. చరణ్‌ అద్భుతమైన ఎనర్జీతో డాన్స్‌ చేశాడు. ఇందులో చరణ్‌ పర్ఫార్మెన్స్‌ ‘రంగస్థలం’ను దాటి నెక్స్ట్‌ లెవల్‌లో ఉంటుంది. బుచ్చిబాబు, సతీష్‌ గారికి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రామ్‌ చరణ్‌కు థాంక్యూ. ఇందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు కూడా థాంక్యూ. హిందీ, తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో జూన్‌ 4న రిలీజ్‌ అవుతుంది. హిందీలో జియో వారు విడుదల చేస్తున్నారు. అక్కడ కూడా భారీ రిలీజ్‌ ఉంటుంది’ అని తెలిపారు. ”పెద్ది’ ఏప్రిల్‌ 30న రానందుకు క్షమించండి. జూన్‌ 4న వస్తున్నందుకు ఆశీర్వదించండి.(నవ్వుతూ). ఇది ఒక కమర్షియల్‌ ఎమోషనల్‌ రైడ్‌. మీ అందరి హదయాలకు దగ్గరగా ఉంటుంది. ‘పెద్ది’ని మీ హదయం నుంచి తీసేయడం అంత ఈజీ కాదు. చరణ్‌ సార్‌పై నా ప్రేమ జూన్‌ 4న మీరు చూస్తారు’ అని డైరెక్టర్‌ బుచ్చిబాబు సానా చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -