ఎస్సెస్సీలో జిల్లా టాపర్‌గా నిలిచిన మనోజ్ఞకు ఘన సత్కారం
నవతెలంగాణ – కాటారం
ప్రతిభకు పట్టం కట్టిన మరో ఉదాహరణగా, మండల కేంద్రంలోని ఆదర్శ హైస్కూల్ విద్యార్థిని మనోజ్ఞ ఎస్సెస్సీ ఫలితాల్లో 590 మార్కులు సాధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టాపర్‌గా నిలిచింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం ధన్వాడలో ఆమెను శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు.
గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని మనోజ్ఞకు సూచించారు. ఆమె సాధించిన విజయం ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థినికి నాణ్యమైన విద్యను అందించిన ఆదర్శ హైస్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్ రావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. అంతకుముందు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మనోజ్ఞను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తదితరులు అభినందించి షీల్డ్‌ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, కాటారం ఏఎంసీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమలసమ్మయ్య, డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ విద్యార్థిని సన్మానించిన మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -



