Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు ఆరుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు ఆరుగురు మృతి

- Advertisement -

గుట్ట దర్శనానికి వెళ్లి వస్తుండగా శంషాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై
ఘోర రోడ్డు ప్రమాదం మృతులంతా సిరిసిల్ల వాసులు

నవతెలంగాణ-శంషాబాద్‌
యాదగిరిగుట్టకు వెళ్లి దేవుని దర్శనం చేసుకుని తిరిగి వెళుతున్న క్రమంలో ఓ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం కబళించింది. సాఫీగా ఇంటికి చేరుకోవాల్సిన వారి కుటుంబంలో చిన్న నిర్లక్ష్యం తీవ్ర విషాదాన్ని నింపింది. ‘అతివేగం’ ఆరుగురి ప్రాణాలను బలిగొంది. ఆ కుటుంబమంతా రెప్పపాటు కాలంలో విగత జీవులుగా మారడంతో బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యా రు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై శుక్రవారం ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢకొీట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల ప్రాంతానికి బొల్లి శివ కుమార్‌(37)( డ్రైవర్‌) సనత్‌ నగర్‌లో ఆగి ఉన్న లారీని ఢకొీట్టిన కారు..ఆరుగురు మృతి నివాసం ఉంటున్నాడు. అతను, అతనితో పాటు సిరిసిల్లకు చెందిన పలువురు కలిసి యాదగిరిగుట్టకు దైవ దర్శనానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌-16 సమీపంలో సాయంత్రం 4గంటల సమయంలో ఆగి ఉన్న లారీని వేగంగా వెనుక నుంచి ఢ కొట్టారు. కారులో ఉన్న ఏడుగురిలో ఆరుగురు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న శివకుమార్‌ (37)తోపాటు అతని భార్య బొల్లి లాస్య(35), కుమార్తె బొల్లి రిషిత(7), కోడెం శ్రీనివాస్‌(40), కృష్ణచంద్ర (13), కోడెం మాధవ్‌(10) మృతిచెందారు. తీవ్ర గాయాల పాలైన శ్రీనివాస్‌ భార్య శ్వేతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా ఢకొీట్టడం వలనే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -