నవతెలంగాణ – మల్హర్ రావు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్మిక సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన మేడే వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర కీలకమని, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని అభినందించారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ సమాజ పురోగతికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మంథని పట్టణంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇల్లు లేని వారికి గుర్తింపు ఇచ్చి, వారికి ఇందిరమ్మ ఇళ్లను అందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
మేడే సందర్భంగా కార్మికులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



