నవతెలంగాణ – కామారెడ్డి
జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఐదుగురు ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వైద్యుల పాత్ర అత్యంత గొప్పదని, ప్రజల ప్రాణాలను కాపాడుతూ నిస్వార్థ సేవలు అందిస్తున్న వైద్యులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఎం. రాజన్న సన్మానిత వైద్యులను సభకు పరిచయం చేశారు. అనంతరం జై గౌడ్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. రామలింగం, డాక్టర్ పి. సుదర్శన్ రాజ్, డాక్టర్ కే. వెంకట్ రాజం, డాక్టర్ కే. వీరేశం, డాక్టర్ వి. విజయకుమార్‌లను శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నరసింహం, సత్యనారాయణ, రాజిరెడ్డి, మోహన్ రెడ్డి, విశ్వనాథం, రామ్ కిషన్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవం..వైద్యులకు ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



