Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2003లో  పదవతరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. మండుతున్న ఎండల నేపథ్యంలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి కాబట్టి ప్రయాణికులు,బాటసారులు,ప్రజలకు దాహార్తి తీర్చడాని చలివేంద్రం ఏర్పాటు చేసినట్లుగా పూర్వ విద్యార్థులు తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు చేయడంపై పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పుప్పాల రాజు, మాచర్ల సురేష్, ఆకుల రాజబాబు, తిప్పని రాజు, ముడుతనపల్లి ప్రదిప్ ,గాండ్ల రమేష్, పొపోజు కుమారస్వామి, బోయిని సతీష్, తిక్క లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -