నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపును ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు క్రీడాకారుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి క్యాంపును వినియోగించుకోవడం ద్వారా క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరచుకొని రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్నారు. గ్రామానికి చెందిన సీనియర్ క్రీడాకారులు విక్రమ్, రోహిత్, ఇతర క్రీడాకారుల సహకారంతో ఈ క్యాంపు ఈనెల 1వ తేదీ నుండి 31 వ తేదీ వరకు క్యాంపు కోచ్, ఫిజికల్ డైరెక్టర్ రాహుల్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని తెలిపారు. 40 నుంచి 50 మంది విద్యార్థులకు సాఫ్ట్ బాల్ సమ్మర్ క్యాంపులో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రామస్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ సమ్మర్ సాఫ్ట్బాల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం సమ్మర్ క్యాంపు కు హాజరైన క్రీడాకారులకు అరటి పండ్లు, బిస్కెట్స్ అందజేశారు.
సాఫ్ట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంపు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



