మహిళా సంఘాల ద్వారా స్వయం ఉపాధి పొందడం ని అభినందించిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ-మిరుదొడ్డి
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డిపిఎం ప్రకాష్ అన్నారు. శనివారం దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన హోమ్ ఫుడ్స్ ద్వారా మిరుదొడ్డి మండలం లోని కాసులాబాద్ తో పటు పలు గ్రామాల్లో నీ మహిళా సంఘాలు కుండా ప్రేగు, బాదుషా,తో పాటు అనేక రకాల పదార్థాలు మహిళలు తయారు చేశారు. యొక్క వివిధ రకాల పదార్థాలను సమావేశం ఏర్పాటు చేశారు. స్వయం ఉపాధి ద్వారా ఏర్పాటుచేసిన హోమ్ ఫుడ్ ను తక్కువ ధరతో అందరికి అందించాలని ఉద్దేశంతో ఇలాంటి స్వయం ఉపాధి కార్యక్రమాన్ని మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అనంతరం ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఈ యొక్క పదార్థాలను పరిశీలించి ఇలాంటి చిరు వ్యాపార ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని సూచించారు. మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం పట్ల మహిళలను అభినందించారు. ఈ అవకాశాన్ని మహిళలు స్పందించేసుకోవాలని ఆయన సూచించారు. మిర్దొడ్డి మండలం లో అనేక రకాలుగా హోమ్ ఫుడ్ తయారు చేయడం పట్ల మహిళలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో నియోజవర్గంలోని ఏపీఎంలు యాదగిరి బాబురావు లక్ష్మీనరసింహ మైపాల్ తో పాటు సీసీలు బాలరాజు జ్యోతి మణమ్మ వరలక్ష్మి ప్రభాకర్ రాజేశ్వరరావు ప్రవీణ్ వైకుంఠం సిద్ధిరాములు భాస్కర్ తో పాటు తదితరులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.



