Saturday, May 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరంగల్ రైతు సదస్సుకు తరలి రావాలి

వరంగల్ రైతు సదస్సుకు తరలి రావాలి

- Advertisement -

• బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య 
నవతెలంగాణ – పెద్దవంగర
ఈ నెల 6న వరంగల్ లో నిర్వహించే రైతు సదస్సు కు పార్టీ శ్రేణులు, రైతన్నలు పెద్ద ఎత్తున తరలి రావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలు, నేటికీ హామీలు గానే మిగిలిపోయాయని ఆరోపించారు. రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామాల్లో ఇప్పటి వరకు కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమ నరసింహా రెడ్డి, సుధీర్, వెంకన్న, సర్పంచ్ పరుశరాములు, నాయకులు సుధాకర్, భాస్కర్, వెంకట్రామయ్య, రాంమూర్తి, వెంకట్ రెడ్డి, కృష్ణా రెడ్డి, బిక్షపతి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -