నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాఘవ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆలేరు మండలం రాజానగరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు గురువారం నోట్‌బుక్స్,స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.విద్యార్థులు చదువులో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఈ సందర్భంగా వక్తలు ఆకాంక్షించారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి చేయూతనందించడం సంస్థ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కంపరాజు వెంకటేశ్వర రాజు,ప్రధానోపాధ్యాయురాలు హేమలత,ఉపాధ్యాయుడు ఎండీ ఖాజా,రాఘవ స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు గుండ్రాజు నరసింహరాజు,కొత్వాల్ సాయినాథ్ తదితరులు పాల్గొని విద్యార్థులకు నోట్‌బుక్స్,స్టడీ మెటీరియల్ అందజేశారు.
విద్యార్థులకు నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్ పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



