- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ పట్టణంలోని భవ్య చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి రథోత్సవ వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పాల్గొన్నారు. అదేవిధంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతేకాదు భక్తుల సౌకర్యార్థం మహాన్నదానం కూడా చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులతో కలిసి రథోత్సవాన్ని వీక్షించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ ఘనంగా సన్మానించి, లక్ష్మి నారాయణ ఫోటోలు బహుకరించారు.
- Advertisement -



