గుడ్ మానింగ్ రా ఎండా కాలం అని సిబ్రం తెల్లారకేన్ పెట్కునం సుడు మంచి పానీ సెసినమ్ అన్నట్టు సెట్లాకిండ కుసుం టే ఆడంగా ఈడంగా అచి షెవ్లా కాడా తిర్గి పోథుంటే మస్తు మజా.
మామిడిసెట్లా పైనా కోయిలా కు కు కుస్తుండి చూడు, నా చిన్ తానం కాడ్నుండి గడి కుసే సమ్యంలా కండ్ల తోని సుద్మాంటే కాన్రాలే కాన్రాకుంటే ఈ పటైతే ఇంటునా కద. సిబ్రంకి రానికే సల్లగ్గా మజ్జిగ, రాగంబాలి గిట్లభతగిపించి పంపమని స్ప్పున కడుపుల సల్లగుంటది. బాలనికి బలం రాగులు తిన్నోళ్లు రోగులు కారంట ఎరుకేనా? నిమ్మకాయలు సబ్జా గింజలు పుదీనా ఆకులు పెసర్లు అంపకాయ, పుచ్చకాయ గిసొంటివి ఎక్కవ తింటుండాలి.
మసాలాలు నూనెస్తువుల జోలకి పోవొద్దు. ఏందిరా కంలేష్ ఇదంగా కూసోని ఏదో ఆలోచిస్తున్నావు, ఇంది గి రోజు పత్రికల గురించా మి సోషల్ సారు సెలబస్ కాకుండా చానా మాటలు సెప్తుందంట కడ బాగా సద్వుకున్నోడుయింటాడు, మా కాక కూడా అనరుండే గా దీనాళ్లనంగ్రెజుల్లా ఉక్కుమత్‌ల నోరిప్ప మాట్లాడనికే పెన్ను బట్టి రాయానికే గింతైనా ఆజాద్ లేకుండే నంట రాసినీళ్లు జైళ్ల పాలే.
ఎంత మంది గట్లైండ్రో మా కాకొల్యూబ్సెప్తుంటే పండ్లు గోరుకుతుంటి పాట పాట గిప్పుడు అట్లేం లేదు లే దేశానికి శతంత్రం ఒచు పత్రికలకూబకూడా వోచినాయి.
గా దినం ఆడపిల్లలందరూ కులుక కుంటా ఆళ్ళకొచ్చినట్టు సెయ్య బాటిండ్రు డాన్స్, డాన్సుల్లో మస్తు రకాలంట మనసొంటి ఊరోళ్ళకి గవన్ని ఎం తప్ప, డాన్సులు సేసేటోళ్ళని పిల్పించి మనకదా ప్రోగ్రామ్ ప్పిస్తే సూస్తారు దూరం కెళ్ళి వోచినోళ్లకు మంచి ఇందులు కూడా సేసి పంపాలే.
తెలుసుకునికే షురూ జేస్తే దునియాలో ఎన్నో మన బాత్కెబ్సరి పోదు సంద్రం ల నీటి బొత్తులెక్క మనకు ఎం తెలుసాని అనిపిస్తది
- గంగరాజ పద్మజ, 9247751121



