- Advertisement -
పచ్చని పైరుల పరవళ్ళు
మంచి మనసుల ఆప్యాయతలు
కల్మషం లేని చిరునవ్వులు
మన పల్లెటూరి అందాలు
ఏటి గలగలల శబ్దాలు
పక్షుల కిలకిల రావాలు
చల్లని గాలుల రాగాలు
పల్లె మనసుకు ప్రాణాలు
అన్నం పెట్టే రైతన్నలకు
ఆలవాలము మన పల్లె
అనురాగాల తోరణాలతో
విలసిల్లేను మన పల్లె
స్వర్గంలోని అందాలన్నీ
పల్లె ప్రకృతిలో ఉంటాయి
అమ్మ ప్రేమలోని కమ్మదనం
పల్లె ఒడిలోన దొరికేను
జాగిలం లాస్య ప్రియ
పదవ తరగతి
ZPHS ఏఖీన్ పూర్
కోరుట్ల మండలం
జగిత్యాల జిల్లా
- Advertisement -



