నవతెలంగాణ-ఆలేరు టౌన్
భారత హాకీ దిగ్గజ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి (జాతీయ క్రీడా దినోత్సవం) పురస్కరించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఖో ఖో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా యువజన మరియు క్రీడల అధికారి (డీవైఎస్‌ఓ) కే. ధనంజేయులు, జిల్లా ఎస్సీ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED) శ్యామ్ సుందర్ హాజరయ్యారు. తొలుత వారు హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం అతిథులు మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా నైపుణ్యాలను వెలికితీసేందుకే ఇలాంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పోటీల అనంతరం ప్రతిభ కనబరిచి గెలుపొందిన విజేతలకు, రన్నరప్‌లకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణకుఖో ఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నారి కృష్ణమూర్తి డీసీఓ నాగార్జున, ఎఎస్‌ఐ శ్రీనివాస్, మాజీ ఎఫ్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్, వాయము ఉపాధ్యాయులు కే .గోపాల్, రఘువీర్ సింగ్, రాయగిరి, వెంకటరమణ, పి రమేష్ రెడ్డి, ఐలయ్య, క్రీడాకారులు, అధికారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



