స్క్రూట్నీలో ముగ్గురు నామినేషన్ల తిరస్కరణ

– విలేకరుల సమావేశంలో ఎన్నికల అధికారుల వెల్లడి
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
షాద్‌నగర్‌ అసెంబ్లీ బరిలో నిలిచిన అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు సోమవారం పరిశీలించారు. అసెంబ్లీ బరిలో నిలిచిన 24 మందిలో ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించినట్టు ఎ న్నికల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా యుగ తులసి పార్టీ అభ్యర్థి పులిజాల నవీన్‌, ఎం రాము, భు యంకారి రవీందర్‌ల నామినేషన్లను తిరస్కరించినట్టు ఎన్నికల పరిశీలకులు చంద్రకాంత్‌ ఐఏఎస్‌ తెలిపారు. యుగ తులసి పార్టీకి చెందిన పులిజాల నవీన్‌ పదిమం దితో బలపరచాల్సి ఉండగా కేవలం ఒక్కరు మాత్రమే బలపరిచినట్టు అధికారులు తెలిపారు. దీంతో అతని నామినేషన్‌ రిజెక్ట్‌ చేసినట్టు చెప్పారు. అదేవిధంగా బీ ఎస్పీ నుంచి వేసిన రాము బిఫామ్‌ అందజేయక పోవడంతో ఆయన నామినేషన్‌ కూడా తిరస్కరించి నట్టు తెలిపారు. అలాగే భుయంగారి రవీందర్‌ తన నామినేషన్‌ ఫారంలో కోర్టు కన్వెక్షన్‌ వేసినట్టు చెప్ప డంతో నామినేషన్‌ను తిరస్కరించారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో తగిన ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎన్నికల పరిశీలకులు చంద్రకాంత్‌ తెలిపారు. ఈనెల 16వ తేదీ నుండి స్థానిక ఎన్నికల కార్యాలయంలో అందుబాటులో ఉంటామని చెప్పారు. ఉదయం 10:30 నుండి 11:30 వరకు ప్రజలు ఫిర్యాదులు తీసుకురావచ్చని చెప్పారు.

Spread the love