Sunday, May 3, 2026
E-PAPER
Homeఖమ్మంకాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు పనిచేస్తున్నాయా లేదా? 

కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు, చెవులు పనిచేస్తున్నాయా లేదా? 

- Advertisement -

-మే ఒకటి నుంచి కొనుగోలు కేంద్రాల పోర్టళ్ళు పనిచేయడ లేదు
– తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలు 
– ఉద్దేశపూర్వకంగానే మొక్కజొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు
– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు 
నవతెలంగాణ – బోనకల్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు చెవులు పనిచేస్తున్నాయా లేదా అంటూ తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని బోనకల్  మండల పరిధిలోనే లక్ష్మీపురం సొసైటీ పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో రావినూతల సొసైటీ పరిధిలో ప్రభుత్వం కొనుగోలు చేసి తరలించకుండా కళాలలో ఉంచిన మొక్కజొన్న బస్తాలను రోజులు తరబడి కొనుగోలు చేయకుండా కళాలో ఉన్న మొక్కజొన్నలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు త కలిసి బొంతు రాంబాబు తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు సిపిఎం మండల కార్యదర్శి మడిపల్లి గోపాలరావు మండల కార్యదర్శి కిలారు సురేష్ తో కలిసి ఆదివారం పరిశీలించారు. రైతులు చెబుతున్న గాధలను విని వారు అవాక్ అయ్యారు. ఈ సందర్భంగా బొంతు రాంబాబు మాట్లాడుతూ ఒకవైపు తీవ్రమైన ఎండలు మరొకవైపు వాతావరణం లో వడగాలులు మరొకవైపు పొలాలలో అగ్ని మంటలతో రైతుల ప్రతిరోజు దినదిన గండంగా జీవనం సాగిస్తున్నారని అయినా ఈ ప్రభుత్వానికి రైతులపై కనికరం కలగటం లేదని ఆయన ఘాటుగా విమర్శించారు. రైతుల నుంచి మొక్కజొన్నలను కొనుగోలు చేయకుండా రోజులు తరబడి ఎందుకు ఉంచుతున్నారో ప్రభుత్వ సమాధానం చెప్పాలని అయిన డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన మొక్కజొన్న బస్తాలను గోడౌన్లకు ఎందుకు తరలించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 8 లక్షల మెట్రిక్ టన్నులు సామర్థ్యం కలిగిన గోడౌన్ లో ఉన్నప్పటికీ కొనుగోలు చేసిన వాటిని తరలించకుండా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు మే ఫస్ట్ నుంచి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం పోర్టల్ పనిచేయడ లేదన్నారు. దీనిని బట్టి మొక్కజొన్న కొనుగోళ్ళను నిలిపివేసినట్లు అర్థమవుతుందన్నారు. ట్రంక్ షీట్లు అధికారులు రాయటం లేదన్నారు. ప్రభుత్వానికి చేతకాకపోతే తాము మొక్కజొన్నలను కొనుగోలు చేయలేమని చేతులెత్తేయాలని ఎద్దేవా చేశారు. కళాలలో ఉన్న మొక్కజొన్నలు అగ్ని ప్రమాదాలకు కాలిపోతున్నాయని రైతుల కన్నీరు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కజొన్నలు తడిసిన కాలిన పనికిరావు అని అధికారులే చెబుతున్నారని అలాంటప్పుడు అధికారులు ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదో సమాధానం చెప్పాలని అని డిమాండ్ చేశారు. రైతులకి ఈ నెల నాలుగో తేదీ నుంచి 10వ తేదీ వరకు పంటలపై నైపుణ్య శిక్షణ తరగతులు ఇవ్వటం కాదు ముందుగా రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉందని ఆయన స్పష్టం చేశారు. కల్లుబొల్లి మాటలతో ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కొనుగోలు కేంద్రాలపై మాయమాటలు చెప్పి తప్పుకోవటం కాదు కొనుగోలు కేంద్రాలకు వచ్చి రైతుల కష్టాలు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. లారీలను పంపకుండా ప్రభుత్వం ఉద్వేశ పూరకంగానే వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణపై రైతుల కష్టాలపై వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేయనున్నట్లు తెలిపారు ఈ ఆందోళన కార్యక్రమంలో రైతుల పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ మంద కరుణ, లక్ష్మీపురం సొసైటీ మాజీ అధ్యక్షులు మాదినేని వీరభద్రరావు, లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ సునీత, సిపిఎం సీనియర్ నాయకులు ఏడునూతల లక్ష్మణరావు, రైతులు తమ్మారపు లక్ష్మణరావు, పసుపులేటి నరేష్, పుచ్చకాయల వలరాజు, కళ్యాణపు శ్రీనివాసరావు, నల్లమోతు నాగేశ్వరరావు, మరీదు నారాయణ సువర్ణ కంటి వీరయ్య, ఎర్ర బోయిన కల్పన, తెలంగాణ రైతు సంఘం నాయకులు గుడ్డురి ఉమ, ఎర్రగాని నాగరాజు, జోనిబోయిన గురవయ్య, దొండపాడు సత్యనారాయణ, షేక్ నన్నేసాహెబ్, సిపిఎం నాయకులు గుగులోత్ నరేష్, బిఆర్ఎస్ నాయకుడు ముడావత్ సైదా, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -