Friday, July 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంగారు, వజ్రాభరణాలలో కళాత్మకత

బంగారు, వజ్రాభరణాలలో కళాత్మకత

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
బంగారు, వజ్రాభరణాలలో కళాత్మకత, సొగసు , నగల ప్రియులకు ప్రతి నగ లగ్జరీ, భావోద్వేగం, శాశ్వత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది అని నగర మేయర్ కూరగాయలు ఉమారాణి రమేష్ అన్నారు. శుక్రవారం నగరంలోని జోయాలుకాస్ జ్యువెలరీ షాప్ నందు నగర మేయర్ పాల్గొని ‘బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో’ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు మెచ్చిన, మహిళలకు నచ్చిన డిజైన్ లలో ఈ ప్రదర్శన అని, నాణ్యత ప్రమాణాలు తో కూడినటువంటి ఆభరణాలు నగరం లోని అందించడం శుభ పరిణామం అన్నారు. ఈ సందర్భంగా జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ ఎండి డా. జోయ్ అలుక్కాస్ మాట్లాడుతూ “బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో శ్రేష్ఠత పట్ల మా నిబద్ధతను , సొగసు, వ్యక్తిత్వాన్ని ప్రతిధ్వనించే ఆభరణాలను సృష్టించడం, తెలంగాణా ఎల్లప్పుడూ మాకు ప్రత్యేకమైనదని అన్నారు. ఈ ప్రదర్శన యొక్క ఆకర్షణకు తోడు, షో వ్యవధిలో రూ.1 లక్ష, అంతకంటే ఎక్కువ విలువైన డైమండ్ జ్యువెలరీ కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్‌కు ఉచిత గోల్డ్ కాయిన్ లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -