Sunday, May 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గోద్రెజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన

గోద్రెజ్ ఆధ్వర్యంలో వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే వ్యవసాయ క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు డాక్టర్ బైరి రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం రేపు (4వ తేదీ) ఉదయం 8:30 గంటలకు చిరబోయిన మల్లేష్ బావి వద్ద గోద్రెజ్ కంపెనీ సహకారంతో నిర్వహించబడుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల నిర్వహణపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి రైతుకు కానుకలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంఘ సభ్యులు, పరిసర ప్రాంతాల రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -